రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం సలార్
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ
మూవీ లో
శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండ గా ,
ప్రశాంత్ నీల్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు .
రవి బుర్రుర్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు . ఈ
సినిమా షూటింగ్ ప్రారంభ మై ఇప్పటికే చాలా కాలం అవుతుంది . ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యిం ది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ విడుదల తేదీని చిత్ర బృందం విడుదల చేసింది . ఈ
సినిమా ను 28
సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది .
ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సలార్
మూవీ లో ఒక కీలక పాత్రలో శ్రేయ
రెడ్డి నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయ
రెడ్డి గతంలో
కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన
విశాల్ హీరోగా తెరకెక్కిన పొగరు
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. పొగరు
మూవీ లో శ్రేయ
రెడ్డి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ
తమిళ , తెలుగు , మలయాళ భాషల్లో పర్వాలేదు అనే రేంజ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ సలార్ లో అవకాశం దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.