రౌడీ
హీరో విజయ్ దేవరకొండ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈ
సినిమా విడుదలకు ఇంక పది రోజులు మాత్రమే ఉండటంతో
సినిమా ఆగస్టు 25వ తారీకు విడుదలవుతున్న క్రమంలో ఒకపక్క
ఈవెంట్ లు మరోపక్క ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.ఇకపోతే
హీరో విజయ్ దేవరకొండ అదే విధంగా
హీరోయిన్ అనన్య పాండే మొన్నటి వరకు నార్త్ ఇండియాలో చాలా చోట్ల పాల్గొనడం తెలిసిందే.అయితే ముంబాయి, గుజరాత్, పాట్నా,
పంజాబ్ వంటి చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు కలిసి చేయడం జరిగింది. అయితే ఇక ఆగస్టు 14వ తారీకు నుండి సౌత్ ఇండియాలో స్టార్ట్ చేశారు.
కాగా ఆగస్టు 14 వ తారీకు
వరంగల్ లో “లైగర్” కి సంబంధించి భారీ
ఈవెంట్ జరగటం తెలిసిందే.ఇక విజయ్
దేవరకొండ తో పాటు
హీరోయిన్ అనన్య పాండే దర్శకులు
పూరి జగన్నాథ్ మరి కొంతమంది కీలక నటీనటులు పాల్గొనడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తారీకు
హైదరాబాద్ లో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా
హీరో విజయ్ దేవరకొండ మరియు
హీరోయిన్ అనన్య పాండే స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.పోతే ఇంటర్వ్యూలో ఓ విలేఖరి
విజయ్ దేవరకొండ ని నీకు ఇష్టమైన
హీరో ఎవరని ప్రశ్నించారు.
ఇక దానికి రౌడీ
విజయ్ దేవరకొండ ఏమీ ఆలోచించకుండా
సూపర్ స్టార్ మహేష్ బాబుని టక్కునే చెప్పేశారు. అంతేకాదు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ చేసిన “పోకిరి” అంటే చాలా ఇష్టమని అన్నారు.అయితే ఇంకా అనేక విషయాలు తెలియజేసి మహేశ్ పై మరోసారి తన అభిమానాన్ని చాటాడు.ఇకపోతే గతంలో కూడా
విజయ్ దేవరకొండ… మహేష్ బాబు తన ఫేవరెట్
హీరో అని చెప్పడం జరిగింది.ఇక అది కూడా మహేష్ స్టేజిపై ఉండగానే చెప్పారు. అయితే ఇదిలా ఉంటే
హీరోయిన్ అనన్య పాండే నీ ప్రశ్నించగా తనకి ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది..!!