పాపం అప్పుడే ఈ హీరోయిన్ బోర్ కొట్టేసిందా..!!
ఇక దాంతో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దాదాపుగా రూ.100 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరింది. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లను దక్కించుకోవడం మొదలుపెట్టింది. ఇక క్రేజీ హీరోల సినిమాలలో అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానితో లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించింది.. ఇక దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇక తర్వాత నాగచైతన్యతో బంగార్రాజు సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని వరుస ప్లాప్ లు ఇచ్చాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
ఇక ఈ వరుస ప్లాపులకు తోడు ఈమె ప్రతి సినిమాలో కూడా ఈమె పెట్టే ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులు సైతం ఈమెను చూడలేక పోతున్నట్లుగా తెలుస్తున్నది. దీంతో కృతి శెట్టి ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్ కి అప్పుడే బోరు కొట్టేసిందా అన్నట్లుగా పలువురు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది . సరిగ్గా ఈ మూవీ విడుదలకు నెల రోజులు ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా ఇద్దరి కెరియర్ మారుతుందేమో చూడాలి.