త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వబోతున్న అనుపమ పరమేశ్వరన్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళం మూవీ ప్రేమమ్ తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచింది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అ ఆ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .


అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' మూవీ లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి తన నటన తో , అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది . ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ తెలుగు లో అనేక మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొన సాగిస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది .


మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది . కార్తికేయ 2 మూవీ ద్వారా అనుపమ పరమేశ్వరన్ హిందీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఒక క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కబోయే హిందీ మూవీ లో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక క్రేజీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ముద్దు గుమ్మను హిందీ లో లాంచ్ చేయడానికి సంప్రదింపులు జరగా కథ బాగా నచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఈ హిందీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: