టాలీవుడ్ సీనియర్ హీరో అండ్ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.అయితే ఆయన ఇటీవలి కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు.ఇక ఈ క్రమంలో 'తీస్‌మార్ ఖాన్' అనే చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యాడు ఆది. నాటకం ఫేం కళ్యాణ్ జీ గోగన డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది.ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన తీస్‌మార్ ఖాన్ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన కూడా వచ్చింది. ఇక ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..మంచి మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక పూర్ణ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ ఈ చిత్రంలో కీ రోల్స్‌లో నటించారు. తీస్ మార్ ఖాన్ సినిమాకు సాయికార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్.ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు అనేవి ఉంటాయి. అయితే కథ, కథనం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. కానీ ఆది సాయికుమార్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి.సినిమా మొత్తం ఆది సాయికుమార్ ఇంకా తన సోదరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనే విషయం మీద నడుస్తుంది.
ఇక హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పాత్ర చిత్రీకరించిన విధానం కూడా కమర్షియల్ సినిమా టెంప్లేట్ హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది.ఇక పాటలు కూడా ఏదో సందర్భం లేకుండా వచ్చినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా అయితే బాగానే ఉంది.కానీ సినిమాకి ముఖ్యమైన కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది.రొటీన్ కథ, బోరింగ్ సీన్స్, అవసరం లేకుండా వచ్చే పాటలు ఇంకా బలహీనమైన కథనం ప్రేక్షకుల కథనాన్ని పరీక్షిస్తాయి.ఇక చివరిగా..ఆది సాయి కుమార్ గత చిత్రాలు మిక్స్ డ్ టాక్ పొందగా, ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే అభిప్రాయంలో అతను ఉన్నాడు. కాని బలహీనమైన కథ ఇంకా కథనం ప్రేక్షకులని పెద్దగా ఆకర్షించలేకపోయింది. అందువల్ల ఈ సినిమా ఆదికి మరొక ఫ్లాప్ చిత్రంగానే మిగిలిపోయింది.ఇక ఆది మరోవైపు ఫణి కృష్ణ దర్శకత్వంలో క్రేజీ ఫెలో అనే సినిమా చేస్తున్నాడు. దిగంగనా సూర్యవంశి, మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతోనైనా ఆది మెప్పుస్తాడేమో చూడాలి.