లైగర్ : ట్విట్టర్లో లైగర్ ఎమోజీ ట్రెండింగ్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలోనే పెళ్లిచూపులు లాంటి సినిమాతో లైమ్‌ లైట్లోకి వచ్చిన విజయ్‌..అర్జున్ రెడ్డి సినిమాతో అయితే సెన్సేషనల్ హిట్ కొట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశాడు. అయితే.. ఇక అప్పటిదాకా వెళుతున్న సినీ ట్రాక్ మార్చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నారు విజయ్‌. ఒక హీరో అంటే ఇలా కూడా ఉంటాడా? అనే టాక్‌తో బాగా ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే..ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25 వ తేదీనన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో విజయ్ దేవరకొండ చాలా బిజీగా ఉన్నాడు. దేశంలోని పలు నగరాల్లో కూడా విజయ్ చాలా కష్టపడుతూ పర్యటిస్తున్నాడు.ఇక ఈ లైగర్ సినిమాతో బాలీవుడ్ స్టార్ కిడ్ హాట్ హీరోయిన్ అనన్యా పాండే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నంది. 



విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటిస్తోంది.ఇంకా అలాగే వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇక ఈ ఊరు ఆఊరు అని కాకుండా.. ఫ్యాన్‌ టూర్‌ పేరుతో అన్ని ఏరియాలను కవర్‌ చేస్తున్నాడు రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ. అయితే.. ట్విట్టర్‌లో కూడా లైగర్‌ మెనియా బాగానే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే లైగర్‌ సినిమాకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. మరో రెండు రోజుల్లో లైగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని కూడా నిర్వహించనున్నారు. అయితే.. ఇక ఈ క్రమంలో.. ట్విట్టర్‌ లో లైగర్‌ పేరు మీద ఒక ఎమోజీ దర్శనిమిస్తోంది. ఈ ఎమోజీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.అయితే.. రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ క్రేజ్‌ వల్ల ట్విట్టర్‌ ఇప్పుడు ఈ ఎమోజీ అనేది ట్రెండింగ్‌లో ఉంది.ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్. మరి ఈ సినిమా విజయ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: