'లైగర్' క్లైమాక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి జగన్నాథ్..!

Pulgam Srinivas
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఖరుగా ఈస్మార్ట్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహించాడు.


ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ 'లైగర్' అనే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కి దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ ఈ మూవీ లో హీరోగా నటించగా , బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన భారీ ఎత్తున తెలుగు తో పాటు తమిళ , హిందీ ,  మలయాళ ,  కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా పూరీ జగన్నాథ్ ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పూరీ జగన్నాథ్ 'లైగర్' మూవీ క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ... ఇది వరకు ఏ మూవీ లో కూడా చూడని విధంగా ఈ మూవీ లో క్లైమాక్స్ ఉంటుంది అని , విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ ల మధ్య ఈ మూవీ క్లైమాక్స్ వస్తుంది అని, ఈ మూవీ క్లైమాక్స్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పూరి జగన్నాథ్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: