పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రౌడీ
హీరో విజయ్
దేవరకొండ నటిస్తున్న పాన్
ఇండియా సినిమా లైగర్. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాపై
టాలీవుడ్ తో పాటు.. అటు
బాలీవుడ్ లో కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఎప్పుడు అయితే లైగర్
సినిమా టైటిల్ ఎనౌన్స్ అయ్యి. విజయ్
దేవరకొండ ఫస్ట్ లుక్ బయటికి వచ్చిందో.. అప్పటినుంచి కూడా లైగర్ నామస్మరణ భారీగా జరుగుతూ వచ్చింది. పైగా ఈ
సినిమా నిర్మాణంలో
హీరోయిన్ ఛార్మితో పాటు
బాలీవుడ్ స్టార్
ప్రొడ్యూసర్ కరణ్‌జోహార్ కూడా భాగస్వామిగా ఉండడంతో లైగర్ సినిమాపై నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.దీనికి తోడు ఇటీవల వరుసగా బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.ఇంకా అదే సమయంలో సౌత్
ఇండియా సినిమాలు.. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద దండయాత్ర చేస్తున్నాయి. తాజాగా వచ్చిన నిఖిల్
కార్తికేయ 2
సినిమా కూడా అక్కడ ఏకంగా వెయ్యకు పైగా స్క్రీన్‌లో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. దీనిని బట్టి తెలుగులో చిన్న హీరోల సినిమాలకు కూడా కథా బలం ఉంటే బాలీవుడ్లో ఎలా దుమ్మురేగుతుందో చూస్తూనే ఉన్నాం.
ఇక ఈనెల 25 వ తేదీన పాన్
ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న లైగర్ బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే లైగర్ అడ్వాన్స్ బుకింగ్‌లతో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాపై దేశమంతటా కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రిలీజ్ కి ముందే లైగర్ ను ఇప్పుడు కొత్త భయం వెంటాడుతోంది. ఇప్పుడు ఇక ఆ టెన్షన్ తో లైగర్ టీం కూడా తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో పరిస్థితిలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాపై ఒక నెగిటివ్ ట్రెండ్ #boycottbollywood అయితే రిలీజ్‌కు ముందు నుంచే నడుస్తోంది. ఈ నెగిటివ్ ట్రెండ్ ఆ
సినిమా ఫలితాలపై చాలా తీవ్రంగా ప్రభావితం చూపేంత పెద్ద ఎత్తున నడుస్తోంది.పైగా విజయ్
దేవరకొండ లాల్ సింగ్ చడ్డా పై పాజిటివ్ కామెంట్స్ ఇంకా తన లైగర్
సినిమా 200 కోట్ల పైగా కలెక్ట్ చేస్తుందని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కామెంట్స్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే లైగర్
సినిమా కూడా ప్లాప్ అవ్వడం ఖాయంలా కనిపిస్తుంది. మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో?