RC15: మెగా ఫ్యాన్స్ కి షాక్.. అసలేం జరుగుతుంది?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మూవీ శరవేగంగా షూటింగ్ అనేది జరుపుకుంటోంది.మొత్తం రూ.170 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఓ విశేషం ఉంది.ఇక అదేంటంటే ఇది శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్ ఇంకా అలాగే హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రకటించగా సెప్టెంబర్ నెలలో ప్రొడక్షన్ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో పాటు తెలుగు ఇంకా తమిళం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటన్నింటి మధ్యలో RC 15 నిర్మాణ పనుల్లో జరుగుతున్న పరిణామాలు కూడా మెగా అభిమానులకు పెద్ద షాక్ ఇస్తున్నాయి.ఇక ఈ మూవీ ఇప్పటికే హైదరాబాద్‌, రాజమండ్రి ఇంకా అమృత్‌సర్‌లలో షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ షెడ్యూల్ లో జరుగుతున్న నేపథ్యంలో టెక్నీషియన్లు ఒక్కొక్కరుగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. కొన్ని తెలియని కారణాలతో ప్రొడ్యూసర్ దిల్ రాజు అతన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


ఇక రామకృష్ణ వాకౌట్ చేసిన తర్వాత అతని స్థానంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డిని తీసుకున్నారు మేకర్స్. అయితే ఆయన కూడా బయటకు వెళ్లినట్లు టాక్ అనేది నడుస్తోంది.అలాగే కొద్ది రోజుల క్రితం RC15 మూవీ షూటింగ్ కోసం రవీందర్ రెడ్డి యూనివర్శిటీ సెట్‌ను నిర్మించారట. అప్పుడే రవీందర్ రెడ్డి ఇంకా దిల్ రాజు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. వరుస ఫ్లాపులతో ఇప్పటికే చాలా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు దిల్ రాజు.ఈ సమయంలోనే తనకు నచ్చిన విధంగా రవీందర్ రెడ్డి సినిమా తీయడం లేదనే కారణంతో అతన్ని దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే, రవీందర్‌రెడ్డి ఏ విషయంలో కూడా రాజీ పడరు. అవసరమైతే సినిమాను కూడా ఆయన వదిలేస్తారు. ఇక ఇప్పుడు కూడా అదే జరిగిందని అంటున్నారు. ఇక శంకర్ తన ప్రాజెక్ట్ ఇండియన్ 2 సినిమాని రీస్టార్ట్ చేయడానికి RC15ని హోల్డ్‌లో ఉంచాడు.ఇదిలా ఉండగా టెక్నీషియన్లు కూడా బయటకు వెళ్లడం మెగా అభిమానులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: