నందమూరి నట సింహం
బాలకృష్ణ అఖండ
సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ
సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ గోపీచంద్ మలినేని,
అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే టాలెంటెడ్
డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో
బాలయ్య 107వ
సినిమా ముగింపు దశకు వచ్చింది. అతి త్వరలోనే
బాలయ్య 108వ
సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పట్టాలెక్కబోతుంది. వీరిద్దరి కాంబో
సినిమా గురించి ఇప్పుడు ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్యతో
అనిల్ రావిపూడి చేయబోతున్న ఈ సినిమాకు గాను దాదాపుగా 75 కోట్లకు పైగా భారీగా ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు అనేవి వస్తున్నాయి.గతంలో
సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు
సినిమా కంటే కూడా అధిక బడ్జెట్‌ను
బాలయ్య 108వ
సినిమా కోసం
అనిల్ రావిపూడి ఖర్చు చేయబోతున్నాడనే సమాచారం తెలుస్తుంది.
ఇప్పటి వరకు కూడా
అనిల్ రావిపూడి కెరీర్ లోనే ఏ సినిమాకు చేయని ఖర్చును ఈ
సినిమా కోసం చేయించబోతున్నాడట.
సినిమా కథానుసారంగా ఈ
సినిమా కాస్త ఎక్కవ బడ్జెట్ ను కోరుకుంటుందని..ఇక అందుకే ఈ
సినిమా కోసం దర్శకుడు కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించబోతున్నాడట.
బాలయ్య కెరీర్‌లో కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన అన్ని సినిమాల్లోకి ఈ
సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఇదే ఏడాది చివరి నుండి ఈ సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.మరి వరుస హిట్లతో మంచి ఫాంలో వున్న
బాలయ్య ఇక ఈ సినిమాతో ఎలాంటి
బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడో చూడాలి.ఎఫ్ 3 సినిమాతో తన కెరీర్ లో మొదటి ప్లాప్ ని అందుకున్న
అనిల్ రావి పూడి
బాలయ్య సినిమాతో ఎలాగైన సూపర్ హిట్ కొట్టాలని చాలా జాగ్రత్తలు తీసుకొని కథను సిద్ధం చేసుకుంటున్నాడు. మరి
సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.