యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుతమైన విజయం తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.
ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా , ఆ మోషన్ ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలు అవుతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. కాక పోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభ తేదీ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఆగస్ట్ 31 వ తేదీ నుండి మొదలు పెట్టాలి అనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా , రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి సిగిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.