చాలా విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఎనిమిదేళ్ల కిందట మంచి సూపర్ హిట్ అందుకున్న 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'కార్తికేయ 2' సినిమా ట్రైలర్‌తోనే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకుని మొదటి ఆట నుంచే సూపర్ గా అదరగొడుతోంది.మొదట్లో చాలా పరిమిత థియేటర్స్‌లో మాత్రమే విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్యాక్డ్ హౌస్‌లతో వావ్ అనిపిస్తోంది.. తెలుగులో ఇరగదీస్తోన్న ఈ సినిమా హిందీ రాష్ట్రాల్లో కూడా బాగా ఇరగదీస్తోంది. మొదట 50 స్క్రీన్స్‌తో ప్రారంభంమైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 3000 పైగా స్క్రీన్స్‌తో వావ్ అనిపిస్తోంది. అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది.
హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకు కూడా 7 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని సమాచారం తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొమ్మిది రోజులకుగాను మొత్తం 22 కోట్ల షేర్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కోంటున్నాయి. ఇక అలాగే మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్లో కూడా అదరగొడుతోంది. ఈరోజు ఈ చిత్రం అమెరికాలో కూడా ప్రతిష్టాత్మకమైన వన్ మిలియన్ డాలర్ మైలురాయిని దాటిందని తెలుస్తోంది. ఇక అంతేకాదు నిఖిల్ సినిమా కెరీర్లో బెస్ట్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక్కడ విశేషం ఏమంటే..ఇంకా ఓవర్సీస్ లోనే కాకుండా హిందీ బెల్ట్‌లో కూడా ఈ చిత్రం కేక పెట్టిస్తోంది.. ఇక మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని భాషాల్లో కలిపి దాదాపుగా 68 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.ఈ సినిమాలో హీరో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.