ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతం బాయ్‌కాట్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం కారణంగా భారీ అంచనాల నడుమ విడుదలైన బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా ' అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.ఎంతో భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే ప్రేక్షకులు లేక బాగా వెలవెలబోయాయి.ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.దీంతో ఇక ఆ థియేటర్ల యాజమానులు ఆ సినిమాని తీసేసి వేరే సినిమాలను కూడా వేసుకున్నారు.ఇండియన్ బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసిన ఆమీర్ ఖాన్ కి తన కెరీర్‌లోనే ఇటువంటి పరిస్థితి మొదటిసారి జరిగింది.ఆమీర్ ఖాన్ సినిమాపై అంతా నెగటివీటి రావడానికి కారణం భారతదేశంలో తనకు అసహనం పెరుగుతుందంటూ కామెంట్స్ చేయడం.ఇక దాదాపు దశాబ్దం క్రితం ఆమీర్ హోస్ట్‌గా చేసిన సత్యమేవ జయతే మాట్లాడిన ఆ వ్యాఖ్యల ప్రభావం.. ఆయన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా' సినిమాపై పడింది.
ఈ బాయ్‌కాట్ కల్చర్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించి కొందరూ ఆమీర్ ఖాన్ కి.. కొందరూ ట్రోలర్స్‌కి కూడా సపోర్టు చేశారు. తాజాగా ఈ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) సైతం తాజాగా ఈ ట్రెండ్‌పై స్పందించడం జరిగింది.ఇక అనుపమ్ ఖేర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మీరు గతంలో ఏదైనా మాట్లాడినట్లయితే, అది ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఎవరైనా ఒక ట్రెండ్‌ను ప్రారంభించాలని భావిస్తే.. అలా స్వేచ్ఛగా చేస్తారు. ఇలా సోషల్ మీడియాలో రోజుకో కొత్త ట్రెండ్ అనేది వస్తూనే ఉంటుంది' అని ఆయన చెప్పుకొచ్చాడు.ఇక అనుపమ్ ఖేర్ మాట్లాడిన మాటలు ఆమీర్ ఉద్దేశించేనని అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక దీనిపై ఆమీర్ ఖాన్ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.