బాహుబలి అంటే ఇండియన్ సినీ చరిత్రలో ఇది ఒక బ్రాండ్. ఏ సినిమా కూడా బాహుబలి సినిమా ను అసలు బీట్ చేయలేదు. స్వయంగా ఎస్ ఎస్ రాజమౌళి మరో భారీ సినిమాను తీసినా కూడా అది బాహుబలి సినిమాకి సరి రాదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం.ఇక అలాంటి బాహుబలి స్థాయి సినిమా అంటూ తమిళ ఫిల్మ్ మేకర్స్ ఇంకా మీడియా వారు ప్రచారం చేస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వం. సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు పార్ట్ లు కూడా భారీ తారాగణం తో రూపొందింది.తమిళ స్టార్స్ తో పాటు ఐశ్వర్య రాయ్ వంటి బాలీవుడ్ స్టార్ నటి కూడా నటించడం వల్ల అంచనాలు అనేవి చాలా భారీగా ఉన్నాయి. అంత మాత్రాన ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోల్చడం చాలా విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి రెండు పార్ట్ లకు గాను ఎస్ ఎస్ రాజమౌళి దాదాపుగా నాలుగు సంవత్సరాలకు పైగానే తీసుకున్నాడు. అలాంటి అద్భుత దృశ్య కావ్యం ను కేవలం రాజమౌళి మాత్రమే ఆవిష్కరించగలడు.
అలాంటిది ఈ పొన్నియిన్ సెల్వం సినిమాను బాహుబలికి ఏమాత్రం తగ్గదు అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి.కేవలం 150 రోజుల్లో పొన్నియిన్ సెల్వం సినిమా రెండు పార్ట్ లను తెరకెక్కించడం జరిగిందట. రెండు పార్ట్ లకు కూడా అతి తక్కువ సమయం తీసుకున్న మణిరత్నం ఎలా బాహుబలి స్థాయి సినిమాను ఆవిష్కరించాడు అంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక మీడియా లో వస్తున్నట్లుగా వార్తలు నిజం అయ్యి ఉండవు అని.. కేవలం సినిమా పబ్లిసిటీ లో భాగంగా మా సినిమా బాహుబలి సినిమా స్థాయి లో ఉంటుందని వారు అంటున్నారు. అంతే తప్ప బాహుబలి సాధించిన వసూళ్లలో కనీసం పావు వంతు అయినా వసూళ్లు సాధించేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే బాహుబలి సినిమాతో పోల్చుకున్నప్పుడు కనీసం వెయ్యి కోట్లు అయినా సాధించాలి. కాని రెండు పార్ట్ లు కూడా ఆ స్థాయి వసూళ్లను సాధిస్తాయి అనే నమ్మకం చాలా తక్కువ.