చిరంజీవి బర్త్డే వేడుకలలో రామ్ చరణ్ ఒక్కరేనా..?

Divya
చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఈరోజు చాలా ఘనంగా జరిగాయి హీరోలతో సహా లక్షలాదిమంది అభిమానుల సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి గోవా సెలబ్రేషన్స్ విరమించి హైదరాబాద్ నగరంలోనే ఉంటారని అందరూ అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ఈసారి చిరంజీవి తన బర్త్డే సెలబ్రేషన్స్ ని గోవాలో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది తనతో పాటు రామ్ చరణ్ కూడా గోవాకు వెళ్లడం జరిగింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు మెగా కార్ని వాల్ ని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం హైటెక్ గ్రౌండ్ కి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.



అయితే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ హాజరు కాకపోవడంతో ఆమెకు అభిమానులు సైతం కాస్త నిరాశ చెందారని చెప్పవచ్చు.. ఈ కార్యక్రమానికి నిహారికతో సాయి ధరంతేజ్, వైష్ణవ తేజ్, శిరీష్ ఎలా ఎంతో మంది మెగా హీరోలు హాజరవుతారని అందరూ భావించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం చేత.. అల్లు అర్జున్ న్యూయార్కులో బిజీగా ఉండడం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.


మెగా కార్నివాల్ కార్యక్రమానికి నాగబాబు తో పాటు సాయి ధరంతేజ్ మాత్రమే హాజరయ్యారు.. మిగిలిన హీరోలు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు అయితే ఈ కార్యక్రమానికి ఎంతోమంది అభిమానుల సైతం తరలి రావడం జరిగింది. ఇక ఆవేదికపై సాయి ధరంతేజ్, నాగబాబు మారుతి తదితరులు మాట్లాడిన మాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి సంబంధించిన ఎటువంటి కార్యక్రమానికైనా సరే ఎవరు ఉన్నా లేకపోయినా అభిమానులు మాత్రం ఎప్పుడు మద్దతుగా నిలుస్తూనే ఉంటారని చెప్పవచ్చు. మరొకసారి ఆ విషయాన్ని ప్రూఫ్ చేశారు అభిమానులు సైతం. దీంతో మెగాస్టార్ కుటుంబం హీరోలంతా సోషల్ మీడియాలో మాత్రమే కేవలం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: