యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే మొన్నటి వరకు ఈ సినిమా ఉందా లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలావుంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అవుతుంది. ఐకపో సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ సమయంలోనే సినిమా కోసం ఇతర నటీ నటులను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక భారీ ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్ 30 సినిమా లో హీరోయిన్ గా సీతారామం హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోతే ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఆమె తో చర్చించడం జరిగిందట. అయితే ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న మృనాల్ ఠాకూర్ కి ఇంత త్వరగా స్టార్ హీరో ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడంతో అమ్మడి ఆనందం కు అవదులు లేకుండా పోయి ఉంటాయి. కాగా అందరి కంటే కూడా ఎక్కువగా మృనాల్ అభిమానులు ఆనందంతో ఊగి పోతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో సినిమా ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా..
కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఒక సారి సినిమా ప్రారంభం అయితే కేవలం మూడు లేదా నాలుగు నెలల్లోనే దర్శకుడు కొరటాల శివ సినిమా ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.అయితే సీతారామం సినిమా లో సీత పాత్ర లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మృనాల్ ఠాకూర్ కి ఎన్టీఆర్ 30 లో అవకాశం రావడం చాలా పెద్ద విషయం. కాగా ఎన్టీఆర్ 30 తర్వాత వరుసగా టాలీవుడ్ లో పెద్ద సినిమా ల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయి..!!