డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
పూరి జగన్నాథ్ ఇప్పటికే తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన
మూవీ లకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తన సత్తాను ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. ఆఖరుగా
పూరి జగన్నాథ్,
రామ్ పోతినేని హీరోగా నబా నాటేష్ ,
నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈస్మార్ట్
శంకర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా
పూరి జగన్నాథ్ 'లైగర్'
మూవీ కి దర్శకత్వం వహించాడు.
అందులో భాగంగా తాజాగా
పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్
సుమ ఆంధ్రావాలా
ఆడియో రిలీజ్ ఫంక్షన్ గురించి గుర్తు చేసింది. దానితో
పూరి జగన్నాథ్ 'ఆంధ్రావాలా'
ఆడియో ఫంక్షన్ కు నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను వేశారు. భారీగా అభిమానులు
ఆడియో ఫంక్షన్ కు తరలి రావడంతో వారిని చూసి
సుమ ఫంక్షన్ కి రాకుండా పారి పోయింది అంటూ
పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు.