హీరోయిన్ కళ్యాణి.. తన భర్త నుండి విడిపోవడానికి కారణం ఇదే..!!
తాజాగా ప్రముఖ నటుడైన చేతన్ చీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకవైపు హీరోగా నటిస్తూ .. మరొకవైపు ప్రొడక్షన్ పనులను కూడా చేస్తూ ఉన్నానని తెలిపారు కళ్యాణి అక్క వాళ్ళు చాప్టర్ -6 సినిమాతో చాలా నష్టపోయారని తెలిపారు. చాప్టర్ సిక్స్ సినిమా అడ్వాన్సుడ్ స్క్రిప్ట్ అవ్వడంతో ఎవ్వరికి అంతగా కనెక్ట్ కాలేక పోయింది.. ఒక కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇవ్వగా అతను చెప్పిన కథను తీసిన కథకు పొంతన లేకపోవడంతో ఆ సినిమా అలా అయిందని చెప్పుకొచ్చారు చేతన్. ఇక కళ్యాణి అక్క నేను చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకొని కూడా ఆ సినిమాని పూర్తి చేశామని తెలిపారు.
ఇక కళ్యాణి, తన భర్త సూర్య కిరణ్ చాలా ఇబ్బందుల సమయంలో నేను కూడా ఉన్నానని చేతన్ తెలిపారు. ఇక వారిద్దరు విడిపోవాలని తీసుకున్న నిర్ణయానికి తన రెస్పెక్ట్ ఇస్తానని చేతన్ తెలిపారు. వారిద్దరూ అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా ఆలోచించి ఉంటారని చేతన చీను తెలిపారు. వాళ్లను కామెంట్ చేయడానికి మనమెవరం అని కూడా తెలిపారు. చాప్టర్-6 వల్లే కళ్యాణి, సూర్య కిరణ్ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని తెలియజేశారు చేతన్ చీను. అంతేకాకుండా చిన్నచిన్న ఇబ్బందుల వల్ల వరు విడిపోవలసి వచ్చిందని తెలిపారు ఈ నటుడు.