నేట్ ఫ్లిక్స్ 'ఓటిటి' ఫ్లాట్ ఫామ్ లో అరుదైన రికార్డ్ ను సాధించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర కని ప్రధాన పాత్రలలో ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలో , డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. 
మొదటి నుండి దేశ వ్యాప్తంగా భారీ అంచనాల కలిగి ఉన్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 25 వ తేదీన తెలుగు తో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
 


ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ మూవీ గత కొంతకాలంగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో  కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సంబంధించిన హిందీ వర్షన్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  ఇప్పటికే ఎన్నో రికార్డ్ లను సృష్టించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంత వరకు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఏ మూవీ సాధించిన ఘనతను ఆర్ ఆర్ ఆర్ మూవీ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ వరుసగా 14 వారాల పాటు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నట్టు , అలాగే ఇప్పటి వరకు ఇంగ్లీష్ మరియు నాన్ ఇంగ్లీష్ మూవీ లు అవి కూడా ఇన్ని వారాల పాటు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో టాప్ ట్రేండింగ్ లో కొనసాగనట్లు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: