ఇక ఇప్పుడు అందరి నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా. అన్నాత్తే సినిమా తరువాత రజనీకాంత్ నటిస్తున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీస్ట్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు.బీస్ట్ వంటి ప్లాప్ చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. బీస్ట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో జైలర్ చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను కాస్త సంకటంలో పడేయటానికి కారణం ఇదేనని ప్రచారం జరుగుతోంది.అయితే తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి పక్కా మాస్ చూపించబోతున్నారని ఇంకా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసిన తరువాత ఆ నమ్మకం కలుగుతోందని అభిమానులు చెబుతున్నారు. చిత్ర షూటింగ్ కూడా ఇప్పుడే మొదలైంది. చిత్రంలో రజనీకాంత్‌తో పాటు ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్ ఇంకా అలాగే శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయన రెండు పాత్రలను దర్శకుడు చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం.ఇక ఇందులో రజనీకాంత్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ఆసక్తిగా మారింది. చిత్రంలో తమన్నా రజినీకాంత్ కి హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. కానీ ఆమె ఇందులో కేవలం ఒక పాత్ర మాత్రమే చేస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె నటిస్తున్నది పాత్ర చిన్న పాత్రేనని తాజా సమాచారం. ఇంకా చెప్పాలంటే రజినీకాంత్ పేట చిత్రంలో త్రిష పాత్ర మాదిరి జైలర్ చిత్రంలో తమన్నా అప్పుడప్పుడు వచ్చి కనిపించి మెరిపిస్తుందట. ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా గ్యాప్ తరువాత తమ అభిమాన నటిని చూడబోతున్నామని సంబరం పడే తమన్నా అభిమానులకు మాత్రం ఇది కాస్త నిరాశపరిచే అంశం అవుతుంది.