టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రౌడీ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.'అర్జున్ రెడ్డి' సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ.ముందు 'ఎవడే సుభ్రహ్మణ్యం', 'పెళ్లి చూపులు' సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది.దాంతో విజయ్ మొదటి సారిగా పాన్ ఇండియా సినిమా 'లైగర్' చేస్తున్నాడు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన అంచనాలు భారీగానే వున్నాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో చేసింది. ఈ ఏడాది ఆచార్య, సర్కారు వారి పాట రాధే శ్యామ్, సినిమాలు వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే rrr సినిమా అయితే తెలుగులో ఏకంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా అయితే రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.తాజాగా ఆ లిస్టులోకి లైగర్ కూడా చేరిపోయినట్టు సమాచారం తెలుస్తోంది. మొత్తంగా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రౌడీ బాయ్ నటించిన లైగర్ కూడా అన్ని భాషల్లో కలిపి 100 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం స్టార్స్ సినిమాలే తప్ప ఈ ఏడాది చిన్న మీడియం హీరోస్ సినిమాలు ఈ రేంజ్ లో చెయ్యలేదు. ఇక రేపు లైగర్ రిలీజ్ అయ్యి 100 కోట్లపైగా రాబడితే విజయ్ కూడా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా మారడం ఖాయం.