అలాంటి సీన్స్ అయితే మరో రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే.. పాయల్..!!

Divya
ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. ఇక ఈ ముద్దుగుమ్మకి పెద్దగా అవకాశాలు లేకపోయినా గ్లామర్ వలకబోస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమధ్య కాలంలో ఈమె దర్శక నిర్మాతలకు కొత్త కండిషన్స్ పెడుతోంది అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే తన పాత్ర గురించి డీటెయిల్స్ గా.. ఇంకా చెప్పాలంటే సినిమాలో లిప్ లాక్స్ , ఇంటిమేట్ సీన్స్ గురించి అడిగి మరీ తెలుసుకుంటుందట. అలాంటి సీన్స్ ఉంటే మాత్రం తనకు ఇచ్చే పారితోషకం తో పాటు మరో రూ.50 లక్షల పారితోషకం అదనంగా కావాలని కూడా డిమాండ్ చేస్తుందట ఈ ముద్దుగుమ్మ.
ఒకవేళ ఏ దర్శక నిర్మాతలైనా సరే తమ సినిమాలలో ఇలాంటి బోల్డ్ సీన్స్ లో ఎవరైనా నటించాలి అనుకుంటే తనను సంప్రదించవచ్చు అని కూడా ఆమె వెల్లడించింది. ఒకవేళ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకపోతే సాధారణ పారితోషకంతోనే సరిపెట్టుకుంటుందట.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మధ్యలో సడన్ గా లిప్ లాక్,  హాట్ సీన్స్ అంటే మాత్రం తను ససే మేరా అంటుందట. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందే పూర్తిగా తెలుసుకొని రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ ఆ తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సమాచారం.
ఇకపోతే పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 తర్వాత అలాంటి సినిమాలే రెండు మూడు చేయగా అందులో ఒకటి క్లిక్ అవ్వకపోవడం తో ఇప్పటికీ కూడా ఈమెకు ఆర్ఎక్స్ 100 క్రేజ్ కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే పాయల్  పెట్టే కండిషన్స్ దర్శకనిర్మాతలకు ఓకే అయితేనే తనను కలవాలని కూడా సూచిస్తుంది. ఇకపోతే అసలే అవకాశాలు లేవు పైగా ఇలాంటి కండిషన్స్ పెడితే ఈమె వైపు ఎవరూ కూడా చూడరంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: