ఇండియన్
మూవీ లవర్స్ కి
టాలీవుడ్ స్టార్
హీరో పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో
ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా
ప్రభాస్ కి ఈమధ్య రకరకాల కారణాల వల్ల ఆపరేషన్లు కూడా అవసరం అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న
ప్రభాస్ కు అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరుగుతుందట.ఇక అందులో భాగంగానే ఒక కీలకమైన ఆపరేషన్ ఇప్పుడు జరగబోతుందట.ఇటీవల కాలంలో
ప్రభాస్ చాలా లావుగా మారి మళ్ళీ సన్నబడిన విషయం కూడా తెలిసిందే. ఈమధ్య విడుదలైన సీతారామం
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ లో
ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించాడు.
ఇక అందులో
ప్రభాస్ లుక్ చూసి అభిమానులు బాగా
ఫిదా అయ్యారు. అయితే
ప్రభాస్ ఫిట్నెస్ విషయంలో అభిమానులు ఏ విధంగా అయితే చూడాలి అనుకుంటున్నారో మారాడు ప్రభాస్. కాగా ఈ మార్పుకి కారణం
ఆక్వా థెరపీ అని తెలుస్తోంది.ఆక్వా థెరపీ అనే న్యాచురల్ టైప్ ద్వారా
ప్రభాస్ బరువు తగ్గాడు. మోకాలి ఆపరేషన్ ముందు బరువు తగ్గడం అవసరమని వైద్యులు సూచించడంతో
ప్రభాస్ ఆక్వా థెరపీ ఫాలో అయ్యాడు. ఈ పద్దతిలో బరువు చాలా త్వరగా తగ్గుతారు. అంతే కాకుండా సహజమైన ప్రక్రియని పాటించినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు బరువు తగ్గాడు కాబట్టి ఆపరేషన్‌కి రెడీ అయినట్టే. అయితే త్వరలోనే ప్రభాస్‌కి చిన్నపాటి ఆపరేషన్ జరగబోతోందట. ఆ ఆపరేషన్ తరవాత రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకొని తన తరువాతి సినిమాలలో పాల్గొనబోతున్నాడు అని సమాచారం తెలుస్తుంది.