ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు
శంకర్,
రామ్ చరణ్ తో
మూవీ కంటే ముందు కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో
ఇండియన్ 2
మూవీ ని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఇండియన్ 2
మూవీ ఆగిపోయింది. దానితో ఎంత కాలం అయినా
ఇండియన్ 2
మూవీ తిరిగి ప్రారంభం కాకపోవడంతో
శంకర్ ,
రామ్ చరణ్ తో
సినిమా మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే తిరిగి దర్శకుడు
శంకర్ 'ఇండియన్ 2'
మూవీ ని ప్రారంభించాడు.
దానితో
రామ్ చరణ్ ,
శంకర్ మూవీ కొంతకాలం పాటు ఆగిపోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలన్నింటికి దర్శకుడు
శంకర్ తాజాగా ఫులిస్టాప్ పెట్టాడు.
శంకర్ సోషల్
మీడియా వేదికగా ఆర్ సి 15 మరియు
ఇండియన్ 2 మూవీలు రెండు షూటింగ్ లు కూడా సమానంగా జరుగుతాయి అని , అలాగే ఆర్ సి 15 షూటింగ్
సెప్టెంబర్ మొదటి వారంలో
హైదరాబాద్ మరియు
వైజాగ్ లో జరుగుతుంది అని
శంకర్ తెలియజేశాడు.