ప్రస్తుతం ఏ
సినిమా ఇండస్ట్రీలో అయిన ఏ హీరోకైనా కూడా ఒక ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది.. జీవితంలో ఒక్కసారైనా కూడా
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ దర్శక ధీరుడు
ఎస్ ఎస్ రాజమౌళి దర్వకత్వంలో నటించాలని ఉంటుంది.ఇక హీరోలు అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు.ఎందుకంటే ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుడు జక్కన్న. తెలుగు సినిమాకు పాన్ ఇండియాను పరిచయం చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇటీవలే
ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న
జక్కన్న తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని, వచ్చే ఏడాది ఈ
సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నట్లు అందరికి తెల్సిందే. ఈలోపు
జక్కన్న హిందీ
సినిమా బ్రహ్మస్త్రను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. రణబీర్ కపూర్,
అలియా భట్ జంటగా
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో
రాజమౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ
సినిమా ప్రమోషన్స్ లో
రాజమౌళి కూడా పాలు పంచుకుంటున్నాడు.
తాజాగా చెన్నె లో జరిగిన
ప్రెస్ మీట్ లో
రాజమౌళి పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురయ్యింది.
తమిళ్ ఇండస్ట్రీలో ఏ హీరోతో మేరుకు వర్క్ చేయాలనీ ఉంది అన్న ప్రశ్నకు..
రాజమౌళి మాట్లాడుతూ..
సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలనీ ఉంది.. కనీసం ఒక్కరోజైనా ఆయనను డైరెక్ట్ చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కాంబో కనుక నిజమైతే.. ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి. వరల్డ్
సూపర్ స్టార్ తో వరల్డ్ సూపర్ డైరెక్టర్.. ఈ కాంబో కనుక కుదిరితే ఇక
ఇండియన్ బాక్సాఫీస్ ఖచ్చితంగా బద్దలు అయ్యినట్లే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం
రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్
ఇండియా సినిమా చేస్తున్నాడు.