తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన
విజయ్ దేవరకొండ ఆ తర్వాత సహాయ దర్శకుడిగా కూడా పనిచేయడం జరిగింది.ఇకపోతే
అర్జున్ రెడ్డి సినిమాతో
డైరెక్టర్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు
విజయ్ దేవరకొండ.ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో కూడా నటించి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. పోతే
విజయ్ దేవరకొండ చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని నేడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్
ఇండియా సినిమా లైగర్ లో నటించాడు.
కాగా సినిమాల ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న
విజయ్ దేవరకొండ పలు యాడ్ ల ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు. ఇక అంతే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం జరిగింది. పోతే
విజయ్ దేవరకొండ లైగర్
సినిమా తర్వాత మరొకసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ
సినిమా తర్వాత శివా నిర్వాన దర్శకత్వంలో
ఖుషీ అనే మరొక పాన్
ఇండియా సినిమాలో నటించబోతున్నారు.అయితే ఇందులో
సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా
విజయ్ దేవరకొండ భవిష్యత్తులో కూడా వరుస విజయాలు సాధించాలని అభిమానుల సైతం భావిస్తున్నారు. అయితే నిజానికి
విజయ్ దేవరకొండకు యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక
సినిమా సినిమాకు ఈయన క్రేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. అందుకే
విజయ్ దేవరకొండ తన కెరియర్ ప్లాన్ ను పక్కగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కూడా భావిస్తున్నారు. పోతే
విజయ్ దేవరకొండ ఒక్కొక్క సినిమాకు ప్రస్తుతం రూ. 10 కోట్ల నుంచి రూ.12 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఇక అంతేకాదు ఒక్కొక్క యాడ్ చేస్తే సుమారుగా రూ.2 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఈయన ఆస్తి సుమారుగా 70 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం..!!