నటి నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే ఇక ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు నిత్యా మీనన్.అయితే అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. పోతే మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్‌లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా..
ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది.ఇకపోతే ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.అయితే అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది.ఇక ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. అయితే ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు.
పోతే అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. అంతేకాదు మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు.ఇక వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు.కాగా నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. అయితే కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు..!!