21 రోజుల్లో 'బింబిసార' మూవీ ఎన్ని కోట్ల లాభాలను సాధించిందో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరో లలో ఒకరు అయిన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కళ్యాణ్ రామ్ కేవలం మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లకి నిర్మాతగా కూడా వ్యవహరించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాత గా కూడా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచు కున్నాడు.


ఇది ఇలా ఉంటే తాజా గా కళ్యాణ్ రామ్ తాజాగా 'బింబిసార' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా ,  సంయుక్తా మీనన్ ,  క్యాథరిన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు . ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టు కోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


ఈ మూవీ 16.20 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. ఈ మూవీ ఇప్పటి వరకు 21 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 21 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 36.62 కోట్ల షేర్ , 62.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో బింబిసార మూవీ 21 రోజులు ముగిసే సరికి 20.42 కోట్ల లాభాలను ప్రపంచ వ్యాప్తంగా అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: