పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ .. ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు రాజకీయాలు మరియు మరోపక్క సినిమాలు అంటూ తెగ బిజీగా వున్నాడు. అయితే వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస సినిమాలతో బిజీగా అయ్యాడు.అంతేకాదు ఇటీవల ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇక ఇంకో వైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. అంతేకాదు తగ్గేదేలే అన్నట్లు తాజా పవన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్దమయ్యారు.ఇదిలావుంటే ఇక 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో..
'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేయనున్నారు.ఇకపోతే ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? ఎప్పుడెప్పుడూ ప్రేక్షకుల ముందుకు రానున్నది అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్.అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ అభిమానుల ట్వీట్లకు రిప్లై ఇచ్చే నేపథ్యంలోనే.. ఓ అభిమానికి తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు హరీష్.కాగా ఆ స్టైలు, స్వాగ్, ఏమైపోయాయ్ కళ్యాణ్ అన్నా. హరీష్ శంకర్ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ… నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది అంటూ ఓ ఫ్యాన్ ట్వీట చేశాడు.
ఇక దీనిపై స్పందించాడు హరీష్ శంకర్. అంతేకాదు అన్నీ ఉంటాయ్.. ఏదీ మిస్ అవ్వదు… మీ ఎదురు చూపులకు తగ్గ ప్రతి ఫలం వస్తుంది నన్ను నమ్మండి అంటూ రిప్లై ఇచ్చాడు.ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇక టాలీవుడ్ అగర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు నటిస్తున్నట్లుగా వార్తలు వినిపించగా ఇటీవల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం హరిష్ శంకర్ పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నట్లు సమాచారం..!!