టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి
మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయిన
రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలను అందుకొని ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించు కొని హీరోగా నటించిన
సినిమా లతో కూడా మంచి విజయాలను అందుకొ ని ప్రస్తుతం
రవితేజ టాలీవుడ్
ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు .
ఇది ఇలా ఉంటే
రవితేజ ఈ సంవత్సరం ఇప్పటికే ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర
రవితేజ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులను కూడా నిరుత్సాహపరిచాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రవితేజ ధమాకా , రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు అనే మూడు
మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో కూడా
రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇలా వరుస
మూవీ లతో ఫుల్
జోష్ లో ఉన్న
రవితేజ మరో
మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాటో గ్రాఫర్ గా కొనసాగుతున్న
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో
రవితేజ ఒక
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త దర్శకులతో పని చేశాడు. అలాగే
కార్తీక్ ఘట్టమనేని కి కూడా
రవితేజ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.