కొన్ని సినిమాలు ఎంతటి క్రేజ్ అందుకుంటాయి అంటే ఆ సినిమాకి ఎలాంటి నెగటివ్ రివ్యూ వచ్చిన ఎలాంటి నెగటివ్ టాక్ వచ్చిన ప్రేక్షకులు అవేవీ పట్టించుకోకుండా ఆ సినిమాలను సపోర్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. తమ అభిమాన
హీరో సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వెళ్లి చూసి దానిని విజయవంతం చేయాలని వారి కోరిక. ఆ విధంగా ఇటీవల
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన
సినిమా లైగర్ విడుదలై డీసెంట్ కలెక్షన్లను అందుకుంటుంది. ఆ చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ కు వస్తున్న కలెక్షన్లకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు.
ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ గురువారం విడుదలైన ఈ
సినిమా ఏకం గా టైర్ వన్ హీరోల రికార్డులను గల్లంతు చేస్తూ ఉండడం విశేషం. ఒకరోజు ఆలస్యంగా
హిందీ బెల్టులో విడుదలైన ఈ
సినిమా అక్కడ కూడా తొలి రోజు మంచి కలెక్షన్స్ నే అందుకుంది. ఆ విధంగా ఈ సినిమాకు నెగెటివిటీని కొంతమంది కావాలని స్ప్రెడ్ చేసినా కూడా ఇంతటి స్థాయిలో ఈ సినిమాను ఇప్పుడు ఆదరిస్తూ ఉండడం విశేషం.
మరి హిందీలో పుష్ప రికార్డులను దాటి తొలి రోజు మంచి వసూళ్లన అందుకున్న ఈ చిత్రం భవిష్యత్తులో ఇంకా ఎన్ని రికార్డుల ను కొల్లగొడుతుందో చూడాలి. పోయిన వారం నుంచి సరైన
సినిమా ధియేటర్లలో లేకపోవడంతో ఈ
సినిమా కొన్ని రోజులు మంచి కలెక్షన్లు అందుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఒక మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాకు ప్రేక్షకులు తప్పకుండా ఆదరించి ఆ సినిమాను భారీ స్థాయిలో విజయం అందుకునేలా చేస్తారో అనడానికి ఈ సినిమానే ఉదాహరణ. పాన్
ఇండియా సినిమాగా వచ్చిన ప్రతి భాషలో ఈ సినిమాకు మంచి పేరుతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి.