అందరికీ ఆమే కావాలంటే ఎలా?

P.Nishanth Kumar
ఏ సినిమా పరిశ్రమ లో అయినా డిమాండ్ బాగా ఉంటే అందరికీ వారి అవసరం ఏర్పడుతుంది. వారు తమ సినిమాలలో నటించాల్సిందిగా ఎన్నో రకాల రికమండేషన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక హీరోయిన్ కు ఎంతగానో డిమాండ్ ఏర్పడడం విశేషం. ఆమె తప్ప మరెవరు దిక్కు లేనట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆమెనే తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొన్ని రోజులు తమ ప్రభావాన్ని చూపిస్తున్న హీరోయి న్ పూజ హెగ్డే ఇప్పుడు అందరి పెద్ద హీరోలకు కూడా ఈమె మొదటి ఆప్షన్ గా ఉండడం ఆమెకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో సైతం ఆమెకు మంచి క్రేజ్ ఏర్పరచుకుంటుంది. గతంలో కొన్ని సినిమాల ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో డిమాండ్ ఉన్న కూడా తెలుగులోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించింది.

ఆ విధంగా ఇప్పుడు ఆమె తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండడం అవి పెద్ద హీరోల సరసన చేస్తూ ఉండడం విశే షం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇకపోతే కొరటాల శివ మరియు ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న రెండవ సినిమాలో కూడా ఏమైనా హీరోయిన్ గా ఎంపిక చేయడానికి పరిశీలనలు చేస్తున్నారట. ఇక పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోలుగా నటిస్తున్న సినిమా జనగణమన లోను ఈమె హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ తనకు ఎదురు లేదు అన్నట్లుగా నిరూపించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: