పుష్ప -2 : సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. ఏమిటంటే..?

Divya
పుష్ప సినిమా పార్ట్ -1 పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది ఇక అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రారాజుగా నిలిచారు. దీంతో పుష్ప -2 సినిమా ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా ఒక క్లారిటీ వచ్చేలా చేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప -2 సినిమా పూజా కార్యక్రమాలను తాజాగా నిర్వహించారు. ఇక షూటింగ్ కూడా త్వరలోనే మొదలుపెట్టడం జరగబోతోంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ తెలియజేసినట్లు తెలుస్తోంది.మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ పుష్ప సినిమా లోని పాటలు ఎంత అద్భుతంగా పాడారో మనకి తెలిసిన విషయమే.. ఇక ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించాయి. ఇప్పుడు పుష్ప -2 కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే పాటలను సిద్ధం చేసినట్లుగా సమాచారం అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు పాటలను పూర్తి చేసినట్లుగా దేవిశ్రీప్రసాద్ తెలుస్తోంది. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ స్వయంగా తెలిపినట్లు సమాచారం.

ఇక దీంతో పార్ట్ 2 కథ ఎలా ఉంటుందో అన్నట్లుగా అభిమానుల సైతం చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మేము చాలా డిఫరెంట్ గా చేయబోతున్నామని స్వయంగా దేవిశ్రీప్రసాద్ చెప్పుకు రావడం గమనార్హం. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఓవర్ నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. పుష్ప -2 సినిమా మరి ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: