'లైగర్' పోయిందన్న బాధ లేదే.. తెగ ఎంజాయ్ చేస్తున్న రౌడీ హీరో?
ఇక పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు అన్ని భాషల్లో కూడా విడుదల చేశారు అని చెప్పాలి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలకు కష్టాలు తప్పవని అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశలో ఉంటాడని అందరూ అనుకున్నారు.
కానీ అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవలే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లైవ్ లో వీక్షించడానికి దుబాయ్ కి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అక్కడ ఇక మ్యాచ్ చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశాడు అనే చెప్పాలి. ఇక విజయ్ తో పాటు క్రికెటర్లు జతిన్ సర్ఫ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా సందడి చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. నాకు ఎనర్జీ చాలా ఎక్కువ.. ఈ రోజు కోహ్లీ కనీసం 50 పరుగులు చేస్తాడని ఆశాభావంతో ఉన్నాను. 20 పరుగులు దాటితే ఆ మార్క్ దాటగలడు.. కోహ్లీ 100వ మ్యాచ్ ను చూడకుండా ఉండలేకపోతున్నా అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ. ఇది చూసిన ప్రేక్షకులు లైగర్ సినిమా పోయిందన్న బాధ విజయ్ లో ఎక్కడా కనిపించడం లేదే అంటూ కామెంట్ చేస్తున్నారు.