పూరి జగన్నాథ్ వల్ల ఆ ముగ్గురు డైరెక్టర్లకు టెన్షన్ పట్టుకుందా..?

Anilkumar
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో లైగర్ సినిమా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు అనే చెప్పాలి .  అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ఇక 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో ఫ్లాప్ సాధించడంతో ముగ్గురు డైరెక్టర్లకు టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మెహర్ రమేష్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటూ..

 ఆయనకే రివర్స్ లో షాకిస్తున్నాయి. కాగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన శక్తి, షాడో సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.  ఇదిలావుంటే ఈ డైరెక్టర్ ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా విషయంలో ఏదైనా తేడా వస్తే మెహర్ రమేష్ ఇండస్ట్రీకే దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.కాగా  ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తాజాగా ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ కు అస్సలు ఆసక్తి లేదు. 
పక్కా కమర్షియల్ ఫ్లాప్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో..

ఈ సినిమా విషయంలో మారుతి ఒకింత టెన్షన్ తోనే పని చేస్తున్నారు. ఇక చిరంజీవి వీరాభిమాని అయిన బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కిస్తున్నారు.  అయితే ఈ డైరెక్టర్ గత సినిమా వెంకీ మామ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. ఇక బాబీ, మారుతి, మెహర్ రమేష్ లను లైగర్ సినిమా ఫలితం పరోక్షంగా ఒకింత టెన్షన్ పెడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.ఇక ఇటీవలే మారుతి ప్రభాస్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని వీలైనంత తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేయాలని మారుతి ప్రయత్నిస్తున్నాడు. చిరంజీవితో బాబీ చేస్తున్న సినిమా కూడా సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెహర్ రమేష్ మెగాస్టార్ తో చేస్తున్న బోలా శంకర్ ఏప్రిల్ లో విడుదల కానుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: