కార్తికేయ-2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం..!!

frame కార్తికేయ-2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం..!!

Divya
తెలుగు యువ హీరోలలో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన వైవిధ్యమైన నటనతో డైలాగులతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు డైరెక్ట్ చందు మండేటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం కార్తికేయ -2 ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. ఇక చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణ పొందడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించి.. తమ సినిమా ను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

కృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది... ఇక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాను చూసి ప్రశంసించడం జరిగింది. తాజాగా ఈ సినిమాను చూసిన గుజరాత్ సీఎం భూపేంద్ర బాయ్ పటేల్.. చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి సందేశాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలియజేశారు

ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని భూపేంద్ర భాయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు ప్రత్యేకంగా గుజరాత్ సీఎం కలిసి అవకాశాన్ని కల్పించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా నిఖిల్ మరియు చందు మొండేటి కలయికలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ ఇక తెరకెక్కించారు ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కూడా నటించింది. ఇక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి వైవాహర్ష తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: