మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇక 'ఉప్పెన' లాంటి లవ్ స్టోరీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్ .కాగా ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే ఈయన నటించిన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.కాగా దీని తర్వాత వచ్చిన కొండపొలం బాగానే డిసప్పాయింట్ చేసింది. ఇక దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఈ మెగా హీరో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన 'రంగ రంగ వైభవంగా' సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా సెప్టెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇక గిరీశాయ దర్శకత్వం వహించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ ( హీరోయిన్‌గా నటించింది. అయితే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.ఇక విడుదల సమయం దగ్గరపడుతున్న ఈ నేపథ్యంలో 'రంగ రంగ వైభవంగా' సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర బృందం పాల్గొంటోంది.కాగా ఈ క్రమంలోనే తాజాగా 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇక దీనిలో భాగంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.."ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. అయితే, ఇక మెగాఫోన్ పట్టుకోవాలనే కోరిక మనసులో ఉంది.
ఇదిలావుంటే కొంతకాలం హీరోగా కాకుండా డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. అంతేకాదు ఆల్రెడీ ఒక కథ కూడా రాసుకున్నా.ఇక ఆ కథతో మా అన్నయ్య సాయితేజ్.. మా బావ వరుణ్ తేజ్‌తో ఓ మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా. అంతేకాదు ఆ సమయం త్వరలో వస్తుందనే ఆశిస్తున్నాను".. అని చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న వైష్ణవ్ తేజ్ డైరెక్షన్ వైపు ఎందుకు ఆలోచిస్తున్నాడో, ఒకవేళ నిజంగా దర్శకుడిగా సినిమా చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే..!!