స్టార్ హీరోయిన్గా సమంత .. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత తెగ వార్తలలో నిలుస్తుంది.ఇక ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అది న్యూసే, పెట్టకపోయిన న్యూసే.ఇదిలావుంటే ఇక సమంత మొన్నటి వరకు వార్తల్లో పేరుగా, బ్రేకింగ్ న్యూస్‌గా నిలుస్తూ వస్తోంది. కాగా ఆమె చేసే కామెంట్లు, పోస్ట్ లు సంచలనంగా మారిన విషయంతెలిసిందే. ఇక తనచూట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది వివాదంగా, చర్చల్లో పాయింట్ గా మారుతుంది.ఇక దీంతో సమంత ఏకంగా సోషల్ మీడియాకే దూరంగా ఉంటోంది. అయితే తాను రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వచ్చిన ఆరోపణల మీద పదే పదే క్లారిటీ ఇస్తూ వచ్చింది. అయితే చివరకు సమంత ఈ విషయం మీద కాఫీ విత్ కరణ్ షోలోనూ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలావుంటే ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత గత 25 రోజులుగా సైలెంట్ అయింది. అయితే సమంత ఇన్ స్టా స్టోరీలో ఎప్పుడూ ఏదో ఒక విషయం చెబుతూనే ఉంటుంది. కాగా సాధన సింగ్, ప్రీతమ్, సాకీ దుస్తులు, హష్, సాషా పెట్స్, సెట్స్‌లో తాను చేసే అల్లరి ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. అంతేకాదు కనీసం సెలెబ్రిటీల బర్త్ డేకు విషెస్ చెబుతూ పోస్టులు వేస్తుంటుంది. గత కొన్ని వారాలుగా సమంత సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. దీనితో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం బాలీవుడ్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ బడా హీరో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండమని సలహా ఇచ్చాడని ఓ వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఇది కాకుండా మరో కారణం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఆమె తన గర్భసంచిని తీయించేసుకుందట. అయితే ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి కి ఫోర్స్ చేస్తున్న కారణంగా.. తన జీవితకాలం అమ్మ అనే పదానికి దూరం అవ్వాలని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది .ఇకపోతే అందుకే సమంత కొన్ని రోజులుగా చాలా సైలెంట్‌గా ఉంటుదని ప్రచారాలు చేస్తున్నారు.ఇక సమంత వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగానే ఉంది. కాగా తెలుగులో ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది.ఇకపోతే ఈమూడు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. అంతేకాదు దీంతోపాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్, తాప్సీ ప్రొడక్షన్లో సినిమాలకు కమిట్ అయినట్టు సమాచారం. ఇక అలాగే ఓ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే..!!