ఎన్టీఆర్ సినిమా లో హీరోయిన్ ఎవరు?

P.Nishanth Kumar
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అంతకుమించిన స్థాయి లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆయన సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడు పూర్తి కావాల్సి ఉండగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కొరటాల శివ స్క్రిప్ట్ పరంగా ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దాంతో ఈ సినిమా  అంతకంతకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ నెలలో ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నారని అంటున్నారు.

గతంలో వీరి కలయిక లో జనతా గ్యారేజ్ సినిమా రాగా అది ప్రేక్షకులను ఎంతో అలరించింది. అలా వరుస విజయాల మీదున్న కొరటాల శివ ను ఆచార్య ఫలితం ఆయనను ఎంతో కృంగదీసింది. ఆర్థిక వత్తిడులతో అయన ఇన్ని రోజులు ఈ సినిమా చేస్తాడా లేదా అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. కానీ ఫైనల్ గా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ఇకపోతే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న మొదటి నుంచి అందరిని ఆలోచింప చేస్తున్న విషయం. 

మొదట్లో ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేశారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంతా, పూజా హెగ్డే లను ఎంపిక చేశామని చెప్పారు. కానీ దీని గురించి వార్తలు రావడమే తప్పా అధికారిక ప్రకటన రావడం మాత్రం జరగలేదు. దాంతో ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదనే చెప్పాలి. మరి సినిమా షూటింగ్ మొదలుపెట్టే సమయానికైనా హీరోయిన్ ఎవరు దానిపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి. ఎన్టీఆర్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ను సిద్ధం చేసిన కొరటాల ఈ సినిమా తో తాను మళ్ళీ కం బ్యాక్ అవ్వాలని భావిస్తున్నాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: