ట్రైలర్: అదరగొడుతున్న జల్సా రీ ట్రైలర్..!!
యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాసింది ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇలియానా అందాలు, పార్వతి మిల్టన్ అందం ఈ సినిమాకు మరింత గ్లామర్ గా నిలిచిందని చెప్పవచ్చు. 2008లో విడుదలైన ఈ సినిమా ఒకేసారి 1000 స్క్రీన్ లలో విడుదలై మొదటిసారి టాలీవుడ్ సినిమా రికార్డును సృష్టించింది ఈ చిత్రం. ఇక అంతే కాకుండా విడుదలైన మొదటి వారంలోని రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అందుచేతనే అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 500 స్క్రీన్ లతో ఈ సినిమాని సెప్టెంబర్ రెండున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా హీరో సాయి ధరన్ తేజ్ చేతుల మీదుగా ఈ సినిమా రీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటి ట్రెండుకు తగ్గట్టుగానే.. కట్ చేసి ట్రైలర్స్ అభిమానుల కోసం ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది ఈ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒకరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తి అయ్యాయి.