టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాత టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి 'లైగర్' ఫలితంపై స్పందించింది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే అదనపు శ్రమ చేయాల్సిందేనని ఆమె అనింది. ఎందుకంటే ఈరోజుల్లో ఓటీటీలో వెరైటీ కంటెంట్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇది తప్పనిసరి అని చెప్పుకొచ్చింది.''ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించలేకపోతే, వాళ్లెవరూ థియేటర్‌కు వచ్చి సినిమా చూడరు. ఎంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలనైనా కుటుంబం మొత్తం కూర్చొని కేవలం ఒక్క క్లిక్‌తో టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్‌లోనే లేదు. అన్ని చోట్లా ఉంది. ఆగస్టులో విడుదలైన 'బింబిసార', 'సీతారామం' ఇంకా అలాగే 'కార్తికేయ2' చిత్రాల బడ్జెట్ మొత్తం రూ.150-170 కోట్లు. ఇవి చాలా మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి.
ఇక్కడ, అర్థంకాని ఇంకో విషయం ఏంటంటే, సినిమాల పట్ల అమితాసక్తి ఉన్న దక్షిణాది వాళ్లు కూడా మా సినిమాపై అసలు ఆసక్తి చూపలేదు. ఇది నిజంగా చాలా భయానక, విచారకరమైన పరిస్థితి'' అని ఛార్మి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. కొవిడ్ కారణంగా 'లైగర్'వాయిదా పడుతూ వచ్చిందని, దీనివల్ల ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. ఏది ఏమైనా సినిమా బాగుంటే ఖచ్చితంగా అందరిస్తాము అని నెటిజెన్స్ ఛార్మికి సమాధానం చెప్తున్నారు.మీరు ఇలాంటి చెత్త సినిమాలు తీస్తే ఎవరూ చూడరు. మీరెంత కష్టపడిన సినిమాలో కంటెంట్ అనేది లేకపోతే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుంది. మీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్, ఓవర్ ప్రమోషన్స్, ఓవర్ కామెంట్స్ వల్లనే ఈ సినిమా పోయింది అంటూ మరికొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.