మహేష్ సినిమాకు.. అరవింద సమేత సెంటిమెంట్?

praveen
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలంటే టాలీవుడ్లో ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు తన సినిమాల్లో రాసే పవర్ ఫుల్ డైలాగ్ లను ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. త్రివిక్రమ్ సినిమాలో అటు హీరోల హీరోయిజం కూడా వీరలెవల్లో ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.  సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను పట్టా లెక్కించేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.


 ఇప్పటికే మహేష్ బాబు తో అతడు  ఖలేజా లాంటి సినిమాలను తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమా గా రాబోతున్న మూవీ కి దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. మహేష్ బాబుతో సినిమాకి త్రివిక్రమ్ తన హిట్ మూవీ యంగ్ టైగర్ నటించిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా సెంటిమెంట్ ను ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాడట.


 ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా షూటింగ్ ప్రారంభం సమయం లో తొలి షెడ్యూల్ లోనే యాక్షన్ సీక్వెన్స్ మొదలుపెట్టారట మాటల మాంత్రికుడు. ఇక ఈ సినిమా  బ్లాక్ బస్టర్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ సినిమాల విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడట. భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడట. అంతేకాదండోయ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం కేజీఎఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బరీఫ్ - అరిగి  లను కంపోజ్ చేయమని గెలిచినట్లు తెలుస్తుంది. ఇందు కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారట. ఇందుకు సంబంధించిన వార్త మాత్రం  టాలీవుడ్లో కోడైకూస్తోంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: