అందాల ముద్దుగుమ్మ
సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సమంత ఇప్పటికే తెలుగు మరియు
తమిళ భాష లలో అనేక సినిమాలలో
హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం
సమంత తెలుగు మరియు
తమిళ భాషలలో స్టార్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తెలుగు మరియు
తమిళ భాషలలో స్టార్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న
సమంత కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ లో
సమంత తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ సాంగ్ ద్వారా
సమంత పాన్
ఇండియా రేంజ్ లో అదిరి పోయే గుర్తింపు ను తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే
సమంత తాజాగా తెలుగు లో యశోద అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లేడీ ఓరియంటెడ్
మూవీ గా తెరకెక్కింది. ఈ
మూవీ కి
హరి హరీష్ దర్శకత్వం వహించగా ,
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ను సోషల్
మీడియా ద్వారా చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా యశోద చిత్ర బృందం ఈ
మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది.
సెప్టెంబర్ 9 వ తేదీన సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు యశోద
మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ
మూవీ యూనిట్ ఒక
పోస్టర్ ని విడుదల చేసింది. ఈ
పోస్టర్ లో
సమంత అనేక మంది అమ్మాయిల మధ్యలో గాయాలతో నిలబడి ఉంది. ఈ
సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.