ఆదిపురుష్ సినిమా కోసం గబ్బర్ సింగ్ విలన్.. ఏమిటంటే..!!

Divya
ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించబోతున్నారు సీత పాత్రలో కృతి సనన్ నటించబోతోంది. ఇక ఈ సినిమాలోని ముఖ్యమైన రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. ఆదిపురుష్ సినిమాని ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందించారు. దాదాపుగా ఈ సినిమాని 10 భాషలలో సైతం డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్లు సమాచార తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.
ఆది పురుష్ సినిమా ఒక విజువల్ వండర్ అన్నట్లుగా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్  డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత పలు సినిమాలలో నటించారు ఇక బాలీవుడ్లో ఆదిపురుష్ హీరో పాత్ర కోసం డబ్బింగ్ చెప్పేందుకు ఇతనిని ఎంచుకోవడం జరిగింది దీంతో ఈ నటుడుకు కూడా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తూ ఉన్నారు. ఇక అంతే కాకుండా ప్రభాస్ వాయిస్ కు శరద్ కేల్కర్ .. వాయిస్ సరిగ్గా సూట్ అవ్వడం ఖాయమని అభిమానుల సైతం భావిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురిష్ సినిమాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే వంటి సినిమాల షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా తనకి వివాహం ఎప్పుడవుతుందా అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: