వావ్: ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సిత..!!

Divya
67 వ ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమాన్ని ముంబైలో చాలా ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ 83వ మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఇక ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతి సనన్ ఉత్తమ నటిగా ఎంపికైనది. ఇక మిమి సినిమాతో నటనకు గాను ఈ ముద్దుగుమ్మకు ఈ అవార్డు దక్కింది. మంగళవారం రోజు రాత్రి ఈ ముద్దు గుమ్మ ఈ అవార్డును అందుకొని ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. రణవీర్ సింగ్ తన భార్య దీపికా పడుకునే ఈ వేదికకు హాజరు కావడం జరిగింది. ఫిలింఫేర్ కంటే ముందుగా IFFM 2022 లో 83 లో తన నటనకు రణవీర్ సింగ్ ఉత్తమ అవార్డు లభించినది.

కమీర్ ఖాన్ తెరకెక్కించిన ఈ చిత్రం 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజయం ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో రన్వీర్ నటించారు. కృతి సనన్ గురించి  విషయానికి వస్తే..2021 లో విడుదలైన మిమి సినిమాలకు కృతి సనన్ చాలా అద్భుతంగా నటించింది అందుచేతనే ఈమె నటనకు గాను ఒక గౌరవం లభించింది. కృతి సనన్ ఈ సినిమాలో అద్దె తల్లి పాత్రలో నటించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ వహించారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రభాస్ తో కలిసి.. ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నది..
ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కించారు. ఇక 2023లో ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడుగా , కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించడంతోపాటు ఇమే అభిమానులు సైతం నెక్స్ట్ ఇయర్ కూడా ఈమెకు అవార్డు రావడం ఖాయం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు తన నటనతో ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఆదిపురుష్ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: