టీజర్: క్రేజీ ఫెలో సినిమా తో మరొకసారి సక్సెస్ కొట్టేలాగా ఉన్న ఆది..!!

frame టీజర్: క్రేజీ ఫెలో సినిమా తో మరొకసారి సక్సెస్ కొట్టేలాగా ఉన్న ఆది..!!

Divya
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరో అది ఎన్నో సంవత్సరాలు అవుతొంది. ఇక ఈ హీరో గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు.హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా తీస్ మార్ ఖాన్ అనే సినిమాతో బాగానే అలరించారు. అయితే ఇప్పుడు తాజాగా క్రేజీ ఫెలో అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్రం బృందం. ఈ సినిమాని ఫణి కృష్ణ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు.
ఈ సినిమాలో మిర్నా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నది ఈ చిత్రం అక్టోబర్ 14న ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అధికారికంగా చిత్ర బంధం సినిమా ప్రకటనలు ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి ఈ సినిమాకు మరింత హైపును తీసుకువచ్చింది.
మరొకసారి ఆది ఈ సినిమాలో ఒక విభిన్నమైన స్టైల్ తో పంచు డైలాగులతో బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఈ సినిమా టీజర్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సాయికుమార్ చెప్పడం గమనార్హం. ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే ఈ సినిమా టీజర్ లో హీరో ఆది, హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్, రవి ప్రకాష్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు వీరందరూ చేసే కామెడీ ఈ సినిమా టీజర్ ను చాలా హైలెట్ అయ్యేలా చేస్తోంది మరి ఈ సినిమాతో హీరో ఆది సక్సెస్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: