సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరక్కబోయే
మూవీ లో హీరోగా నటించడానికి రెడీ గా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్
సెప్టెంబర్ రెండవ వారం నుండి మొదలు కానున్నట్లు తెలుస్తోంది . ఈ
మూవీ లో మహేష్ బాబు సరసన
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా , ఎస్ ఎస్
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ
మూవీ ని
సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నాడు. ఈ
మూవీ ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించ బోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికి షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ
మూవీ గా తెరకెక్కబోతుంది. ఈ
సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ
మూవీ ఫస్ట్ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనున్నట్లు , ఆ షెడ్యూల్లో భారీ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన వెంటనే అతి తక్కువ రోజుల్లోనే రెండవ షెడ్యూల్ ని కూడా ప్రారంభించే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ,
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకు అతడు ,
ఖలేజా రెండు
మూవీ లు తెర కెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో హైడ్రిక్ మూవీ.