మరోసారి బయటపడ్డ మహేష్ మంచితనం.. నెటిజన్స్ ఫిదా!

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల అభిమానులు ఆయన సొంతం. ఎందుకంటే మహేష్ కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా బోలెడన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 1000 మందికి పైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణాలు పోశాడు.మహేష్ బాబుకి లాయల్ ఫ్యాన్స్ ఉండటానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి.బయట కూడా మహేష్.. ఎక్కువగా మాట్లాడడు. తన సినిమాల విషయంలో తప్ప ఎక్కువ మాట్లాడరు మహేష్. ఇదిలా ఉండగా.. తాజాగా మహేష్.. జీ తెలుగులో ప్రసారం అయ్యే డాన్స్‌ ఇండియా డాన్స్ షోకి తన కుమార్తెతో కలిసి పాల్గొన్నాడు.దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో బాబు, కుమార్‌ అనే ఇద్దరు డాన్సర్ల పెర్ఫార్మన్స్ చూసి మహేష్ ఇంప్రెస్ అయిపోయాడు. 'మీరు డాన్స్ చేయలేదు.. జీవించేసారు' అంటూ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.


అంతేకాదు 'నేను చేసే సినిమాలో కానీ చేయబోయే సినిమాల్లో కానీ కచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాను' అంటూ భరోసా కూడా ఇచ్చేశాడు. దీంతో బాబు, కుమార్‌ లు.. ఒక్కసారిగా మహేష్ సాయానికి భావోద్వేగానికి గురయ్యి మహేష్ కాళ్ళ పై పడుతుంటే వారిని లేపి ఆప్యాయంగా హత్తుకున్నాడు మహేష్.సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంట్ ఉన్న వాళ్ళను అస్సలు వదులుకోడు అని అంతా అంటుంటారు. గతంలో తన సినిమాకి పి.ఆర్వో ని మార్చమంటే ఏకంగా నిర్మాతనే మార్చేశాడు. తాను ఇచ్చిన మాటకు మహేష్ బాబు అంతలా కట్టుబడి ఉంటాడు అని ఆ పి.ఆర్వో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది 'సర్కారు వారి పాట' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మహేష్.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: