ఆ సినిమాలకు తలనొప్పిగా మారిన మహేష్, పవన్?

Purushottham Vinay
పెద్ద పెద్ద టాప్ హీరోల సినిమాల వల్ల చిన్న సినిమాలకు అసలు థియేటర్లు అనేవి దొరకడం లేదు. పెద్ద హీరోల సినిమాలు వస్తే చాలు చిన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యి చాలా బాగా ఆడుతున్నా  కూడా వాటిని టాప్ హీరోల క్రేజ్ వల్ల ఇంకా ఫ్యాన్స్ డిమాండ్ వల్ల ఎత్తేస్తున్నారు.ఈ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరక్క ఇప్పటికీ చిన్న నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే.. ఇప్పుడు చిన్న సినిమాలకు ఇంకా మధ్య స్థాయి సినిమాలకు మరో సమస్య వచ్చిపడిందా? గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్ల దగ్గర పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది.వినాయక చవితి పండుగ , పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు దగ్గర దగ్గర రావడం, సూపర్ స్టార్ మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా మొదలైన ట్రెండ్‌ కారణంలో గత రెండు రోజులు, మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పవన్‌ కల్యాణ్‌ సినిమాలు రీ రిలీజ్‌ అవుతున్నాయి. 'తమ్ముడు', 'జల్సా' సినిమాలను వివిధ థియేటర్లలో స్పెషల్‌ షోస్‌గా వేస్తున్నారు. నగరంలోని ముఖ్యమైన సింగిల్‌ స్క్రీన్స్‌లో ఈ సినిమాలు పడుతున్నాయి. అయితే అందులో తప్పేముంది అని అనుకుంటున్నారా? అక్కడ ఇప్పటికే బాగా ఆడుతున్న రెగ్యులర్‌ సినిమాల షోలు ఆపేశారు కాబట్టి.ప్రెజెంట్ థియేటర్లలో 'సీతారామం', 'బింబిసార', 'కార్తికేయ 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆడుతున్నాయి. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో 'లైగర్‌' సినిమా వేస్తున్నారు. 'జల్సా', 'తమ్ముడు' కోసం ఆ సినిమాలు షోలు ఆపేసి వేస్తున్నారు. అయితే దీని వల్ల థియేటర్లకు లాస్‌ ఏమీ లేదు.



కానీ ఇలా ఆడుతున్న సినిమాలు ఎత్తేస్తే మాత్రం ఆ సినిమాల వసూళ్లు దెబ్బతింటాయి. అందులో వినాయకచవితి లాంటి పండగ సమయంలో మంచి వసూళ్లు వస్తాయి అనుకుంటుండగా ఇలా చేయడం ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.ఐమ్యాక్స్‌ లాంటి మల్టిప్లెక్స్‌లో కూడా 'తమ్ముడు', 'జల్సా' షోలే ఎక్కువగా పడ్డాయట. రెండు రోజుల్లోనే 30కిపైగా షోస్‌ వేశారు అని చెబుతున్నారు. ఈ ట్రెండ్‌ మొదలైంది సూపర్ స్టార్ మహేష్‌ సినిమాలతో అయినా.. పవన్‌ సినిమాలతో ఇంకా తారస్థాయికి చేరింది. ఒకవేళ ఈ ట్రెండ్‌ రెండు, మూడు రోజుల నుండి ఒక వారం రేంజిలో ఏ వారమో, పది రోజులో జరిగితే కొత్త, చిన్న సినిమాలకు చాలా ఇబ్బందే. మరోవైపు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అందరూ కూడా అక్టోబరు 23న 'బిల్లా'కు భారీ స్థాయిలో షోస్‌ వేయించాలని చూస్తున్నారట. అప్పుడు కూడా ఇప్పటి పరిస్థితే వస్తుంది.'లైగర్‌' సినిమా లాంటి ఆడని అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసేసి రీ రిలీజ్‌లు చేస్తే ఓకే.. కానీ బాగా ఆడుతున్న సినిమాలు తీసేస్తేనే ఇబ్బంది. కాబట్టి స్టార్లు, నిర్మాతలు, ఫ్యాన్స్‌ ఈ దిశగా కూడా ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: