ఫ్లాప్ అయినా దేవరకొండ కి యాడ్స్ పెరిగాయా!!
అయితే సినిమా పరిశ్రమలో క్రేజ్ పెరిగే కొద్దీ హీరోలకైనా, హీరోయిన్ లకు అయినా బ్రాండ్ అంబాసిడర్ గా చేయమని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హిట్స్ కొట్టే హీరోలకైతే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మొదటినుంచి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఎన్నో యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికే పలు యాడ్స్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో లైగర్ తో అయన కు ఉన్న క్రేజ్ ను చూసి అందరు కూడా ఆశ్చర్యపోయి ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి సిద్ధపడిపోయారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పలు బ్రాండ్స్ ఆయనను సంప్రదించాయట. లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు వచ్చే యాడ్స్ సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడం ఆయనకు ఉన్న క్రేజ్ ను తెలియపరుస్తుంది. మరి రాబోయే సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం ఈ హీరో కి ఇంటర్నేషనల్ స్థాయి లో యాడ్స్ రావడం ఖాయం అని చెప్పొచ్చు. ఇకపోతే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేయబోయే జనగణమన సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఇప్పుడు అభిమానులలో నెలకొంటున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఏదేమైనా లైగర్ సినిమా ప్లాప్ అయినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ కు వచ్చిన ఢోకా ఏం లేదనే చెప్పాలి. అంతకుముందు కంటే ఎక్కువ రెట్టింపు క్రేజ్ ను అయన సొంతం చేసుకున్నాడు.